మహేష్ బాబు ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం శ్రీమంతుడు. సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందిన శ్రీమంతుడు చిత్రం తన తండ్రి నుండి వ్యాపార సామ్రాజ్యాన్ని వారసత్వంగా పొందిన యువకుడి కథ నేపథ్యంలో రూపొందింది. దేవరకోట అనే మారుమూల గ్రామంలో తన తండ్రి పూర్వీకుల మూలాల గురించి తెలుసుకున్నప్పుడు, హర్ష వర్ధన్ గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాడు. 2015 లో విడుదలైన శ్రీమంతుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ2.0 బిలియన్లు వసూళ్ళు చేసింది.
యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన శ్రీమంతుడు చిత్రం తాజాగా యూట్యూబ్‌లో 10 కోట్ల వ్యూస్‌ని రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. యూట్యూబ్‌లో ఇంత వ్యూస్‌ని సంపాదించిన మొదటి తెలుగు మూవీగా శ్రీమంతుడు నిలవడం విశేషం. చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటించగా, ఈ అమ్మడు తన గ్లామరస్‌తో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.