కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి స్టార్ షెట్లర్ పీవీ సింధు బాసటగా నిలిచింది. తన వంతు సాయంగా రెండు తెలుగు రాష్ర్టాలకు కలిపి రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందిస్తానని ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్‌కు సినిమా స్టార్లు నితిన్ రూ.10 లక్షలు, పవన్ కల్యాణ్ రూ.2 కోట్లు, దర్శకులు వీవీ వినాయక్ రూ.5 లక్షలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ.10 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.
పీవీ సింధు ఐదు లక్షల విరాళం