టాస్‌ గెలిచి, బౌలింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇండియా, న్యూజిలాండ్‌ తలపడనున్న నేటి మ్యాచ్‌లో కివీస్‌ మహిళల జట్టు.. టాస్‌ గెలిచి, బౌలింగ్‌ ఎంచుకుంది. భారత మహిళల జట్టు లీగ్‌ దశలో జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య, డిపెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించి, 18 పరుగులతో విజయం సాధించింది. అనంతరం పెర్త్‌ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను సైతం 18 పరుగులతో తేడాతో చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. టీమిండియా నాకౌట్‌ బెర్త్‌కు చేరువవుతుంది. 


ఇండియా జట్టు: స్మృతి మందాన, షెఫాలి వర్మ, తానియా బాటియా(వికెట్‌ కీపర్‌), జెమీమా రోడ్రిగేజ్‌, హార్మన్‌ప్రీత్‌కౌర్‌(కెప్టెన్‌), దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, శిఖా పాండే, రాధా యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌, రాజేశ్వరీ గైక్వాడ్‌. 


న్యూజిలాండ్‌ జట్టు: సోఫి డివైన్‌(కెప్టెన్‌), రేచల్‌ ప్రైస్ట్‌(వికెట్‌ కీపర్‌), సుజీ బేట్స్‌, మ్యాడీ గ్రీన్‌, క్యాటీ మార్టిన్‌, ఎమేలియా కెర్‌,్ర హైలీ జేన్‌సన్‌, అన్నా పీటర్సన్‌, కాస్పెరెక్‌, లీ తాహుహు, రోస్‌మేరీ మైర్‌.