స్టార్ హీరోలతో ఎన్నో అద్భుతమైన చిత్రాలని తీసి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచిన దర్శకుడు శ్రీను వైట్ల. ప్రస్తుతం ఈయనకి బ్యాడ్ టైం నడుస్తుంది. ఇటీవల తీసిన బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ వంటి చిత్రాలు ఫ్లాపులు కావడంతో శ్రీను వైట్ల కెరీర్ కాస్త గతి తప్పినట్టే కనిపిస్తుంది. అయితే గతంలో తనకి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దూకుడు చిత్రానికి సీక్వెల్ చేసి మళ్ళీ ట్రాక్‌లో పడాలని అనుకుంటున్నాడట. రీసెంట్‌గా ఈ దర్శకుడు దూకుడు 2 రేంజ్‌లో కథను తయారుచేసి మహేష్‌కి వినిపించినట్టు సమాచారం. మహేష్ ఈ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. మరోవైపు ఓ మల్టీస్టారర్ కథని కూడా శ్రీను వైట్ల సిద్ధం చేసుకున్నాడని దీనిని ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబులను కలిసి వివరించినట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ని కొద్ది రోజుల పాటు ఇద్దరు హీరోలు హోల్డ్‌లో పెట్టారట. శ్రీనువైట్ల తన కెరీర్‌లో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్, రవితేజ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు .
మల్టీస్టారర్ ప్లాన్.. ప్రధాన పాత్రలలో చిరు, మహేష్