ఇన్నాళ్ళు నటుడిగా.. నిర్మాతగా మనందరికి పరిచయమైన రామ్ చరణ్ ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తాడు. వన్యప్రాణి సంరక్షణ కోసం వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా మారిన రామ్ చరణ్ తాజాగా ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. కొత్తగా నిర్మించిన ఇంట్లో 'వైల్డెస్ట్ డ్రీమ్స్' పేరుతో ఓ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసాడు. అందులో వన్యమృగాల ఫోటోలను కూడా జత చేసాడు చరణ్. అందులో భాగంగానే సింహాలు, చిరుత పులులు, జిరాఫీలతో పాటు మరిన్ని వన్యప్రాణుల ఫొటోలను కూడా పొందు పరిచాడు మెగా వారసుడు. చరణ్‌తో పాటు ఉపాసన కూడా ఇందులో భాగం అవుతుంది. వన్యప్రాణి సంరక్షణ కోసం ప్రపంచ స్థాయిలో చేపట్టే నిధుల సమీకరణలో పాలు పంచుకుంటుంది ఉపాసన.
రామ్ చరణ్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న సమంత, మంచు లక్ష్మీ